ఆంధ్రప్రదేశ్‌లో 'ఎన్‌టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీలో నవంబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఎన్‌ఎస్‌ఏపీ కింద ఉన్న 9.34 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ వాటాను డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మిగిలిన రాష్ట్ర వాటాను సచివాలయ సిబ్బంది ప్రతి నెల 1న ఇంటి వద్దే నగదుగా అందిస్తారు. దీనికి బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
ఏపీలో నవంబర్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం
Source: Vaartha