బీఏపీఎస్ ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవిత చరిత్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సాధు ఆదర్శజీవన్‌దాస్ రచించిన 13 సంపుటాలు, 8,848 పేజీల ఈ గ్రంథం ఒకే రచయిత రాసిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన జీవిత చరిత్రగా నిలిచింది. లండన్‌లోని ఓవో అరెనా వెంబ్లీలో జరిగిన వేడుకల్లో గిన్నిస్ అడ్జుడికేటర్ కార్ల్ సావిల్లె ఈ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.
ప్రముఖ్ స్వామి జీవిత చరిత్రకు గిన్నిస్ రికార్డు
Source: telugutimes.net