ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ సేవను ప్రారంభించింది. 95523 00009 నంబర్‌కు ‘HI’ పంపి, రెవెన్యూ సేవల్లో రీ-ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఎంచుకోవాలి. ఆధార్, ఓటీపీ నమోదు చేసి ₹40 చెల్లిస్తే సర్టిఫికెట్ పీడీఎఫ్ రూపంలో వాట్సాప్‌లోనే అందుతుంది. సచివాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్: ఏపీ ప్రభుత్వ కొత్త సేవ
Source: Vaartha