బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాబోయే రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగుల ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 15 తర్వాత కోస్తాంధ్రలో వర్షాల తీవ్రత పెరగనుంది.
బంగాళాఖాతంలో ఆవర్తనం: ఏపీ, తెలంగాణలకు భారీ వర్ష హెచ్చరికలు
Source: Asianet Telugu