సెంట్రల్ రైల్వే 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో స్క్రాప్ విక్రయాల ద్వారా రూ.323.50 కోట్ల ఆదాయం ఆర్జించింది. దేశంలోని అన్ని జోనల్ రైల్వేలతో పోలిస్తే ఇదే అత్యధికం. సెప్టెంబర్ నెలలో రూ.70.42 కోట్ల స్క్రాప్ విక్రయించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 'జీరో స్క్రాప్ మిషన్'లో భాగంగా పాత లోకోమోటివ్లు, కోచ్లు, స్లీపర్లు వేలం వేయడంతో యార్డులు, డిపోల్లో ఖాళీ అయిన స్థలం అభివృద్ధి పనులకు ఉపయోగపడుతోంది.
చెత్త అమ్మి ఆరు నెలల్లో రూ.323 కోట్లు సంపాదించిన రైల్వే
Source: Asianet Telugu