ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు, స్త్రీశక్తి పథకం బస్సులను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య ఉద్గారాలు, సంప్రదాయ ఇంధన వినియోగం తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే: మంత్రి మండిపల్లి
Source: Vaartha