గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తాగునీటి కొరత తీవ్ర ప్రభావం చూపనుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగూరు, మంజీర జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోవడంతో డిసెంబర్-జనవరి నుంచే కొరత ప్రారంభమయ్యే ప్రమాదముంది. భూగర్భ జలాలు సగటున 6.85 మీటర్లు పడిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. ఈ సమస్యను బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై ఆయుధంగా మార్చుకుంటున్నాయి.
గ్రేటర్ ఎన్నికలపై నీటి కొరత ప్రభావం
Source: Telugu Post