సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులే దాడి చేశారని సౌదీ నేతృత్వ సంకీర్ణ దళాలు ఆరోపించాయి. మృతుల్లో అమెరికన్, బంగ్లాదేశీ, పాలస్తీనీయులతో పాటు పలు దేశాల పౌరులున్నారు. దాడిపై ట్రంప్ స్పందించి, హౌతీలపై చర్యలపై అమెరికా పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది మృతి
Source: Telugu Post