ఫ్లాట్ పిచ్ల సంస్కృతిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బౌలర్లకు సహకారం లేని ఈ పిచ్ల వల్ల ఫాస్ట్ బౌలర్లు ఒత్తిడి, గాయాల బారిన పడుతున్నారని, దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్ల వరకు పిచ్లలో వైవిధ్యం లోపిస్తోందని ఆయన విశ్లేషించారు. బీసీసీఐ తక్షణమే స్పందించి క్యూరేటర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు.
ఫ్లాట్ పిచ్లపై గంభీర్ హెచ్చరిక.. బీసీసీఐ స్పందించాలని డిమాండ్
Source: telugutimes.net