హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) రూ.3,296 కోట్ల రేడియల్ రోడ్-2 టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తమ సంస్థ దాదాపు ₹600 కోట్లు తక్కువ అంచనాతో బిడ్ వేసినా, ప్రత్యేక నిబంధనలతో తమను ఉద్దేశపూర్వకంగా టెండర్ ప్రక్రియ నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని హెచ్చరించారు.
హెచ్‌జీసీఎల్ టెండర్లలో అక్రమాలు: రాజగోపాల్ రెడ్డి ఆరోపణ
Source: Vaartha