ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారుల బదిలీలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని అక్టోబర్ 16 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 16న తుది ఓటరు జాబితా విడుదలైన వెంటనే బదిలీల నిషేధం తొలగిపోనుంది.
అక్టోబర్ 16 వరకు అధికారుల బదిలీలపై నిషేధం పొడిగింపు
Source: telugutimes.net