ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు 365 కేంద్రాల్లో ప్రారంభమైంది. 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. 39,694 మంది సిబ్బంది, 40,679 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
Source: Vaartha