టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ సంస్థ ఛైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి నోయల్ టాటా వైదొలగనున్నారు. కార్పొరేట్ పాలన నిబంధనల ప్రకారం కీలక పదవుల్లో కొనసాగేందుకు 70 ఏళ్ల వయోపరిమితి ఉండటమే ఇందుకు కారణం. ఈ నెల 12తో ఆయన 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. అదే తేదీ నుంచి ఆయన గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతారు. 2003 నుంచి ఛైర్మన్‌గా ఉన్న ఆయన బాధ్యతలను సునీల్ డిసౌజా చేపట్టనున్నారు.
వోల్టాస్ ఛైర్మన్ పదవి నుంచి నోయల్ టాటా వైదొలగనున్నారు
Source: Vaartha