దిశ చట్టం రద్దుపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం

దిశ చట్టం రద్దుపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితను డమ్మీ హోంమంత్రిగా అభివర్ణిస్తూ ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయడం మహిళా వ్యతిరేక విధానమని ఆరోపించారు. చట్టం పేరు మార్చొచ్చని, కానీ దాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies