గిగ్, ప్లాట్ఫాం వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 8 నుంచి చేపట్టాలనుకున్న సమ్మెను విరమించినట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. కార్మిక మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి హామీలతో యూనియన్లు సంతృప్తి వ్యక్తం చేశాయి.
గిగ్ వర్కర్ల సమ్మె విరమణ, ప్రభుత్వంతో చర్చలు సఫలం
Source: Vaartha