2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. ఈ లక్ష్య సాధనకు వ్యవసాయం, తయారీ, సేవల రంగాలను బలోపేతం చేస్తున్నామని, పీఎల్ఐ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే, 2025లో సర్ఫాసీ చట్టం కింద రూ. 1,03,180 కోట్ల రుణ ఎగవేత కేసులు నమోదై, రూ. 32,466 కోట్లు రికవరీ అయ్యాయని పేర్కొన్నారు.
2028-29 నాటికి 5.1 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ
Source: telugutimes.net