సెర్బియాలో తీవ్ర వేడి, కరవు కారణంగా కార్చిచ్చులు చెలరేగాయి. రాజధాని బెల్గ్రేడ్కు 65 కి.మీ దూరంలోని డెలిబ్లాట్స్కా పెస్కారా రక్షిత ప్రకృతి ప్రాంతంలోని పైన్ అడవుల్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. సుమారక్ గ్రామస్థులను ఖాళీ చేయాలని కోరారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సెర్బియాలో కార్చిచ్చులు.. అటవీ ప్రాంతాల్లో మంటలు
Source: Telugu Post