జనసేన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. రేషన్ బియ్యం దందా, ఇసుక అక్రమ విక్రయాలు, మద్యం షాపులు, బార్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరితో వ్యాపారులు, సొంత పార్టీ నేతలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఒంగోలు ఎమ్మెల్యేపై బాలినేని తీవ్ర విమర్శలు
Source: Vaartha