ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతల మధ్య విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని సమన్వయ కమిటీ సూచించింది. ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి, దామచర్ల జనార్దన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో విజయవాడలో సమావేశం జరిగింది. బహిరంగ విమర్శలకు దూరంగా ఉండాలని నేతలకు స్పష్టం చేశారు.
కూటమి ఐక్యతకే ప్రాధాన్యం: నేతలకు సమన్వయ కమిటీ సూచన
Source: telugutimes.net