బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్: భారీ వర్షాల హెచ్చరిక
Source: 10TV Telugu