తెలంగాణ ఆతిథ్యంలో డిసెంబరులో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 20 క్రీడలకు మౌలిక వసతులు కల్పించి, స్టేడియంలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు ప్రముఖులను భాగస్వాములను చేయాలని కసరత్తు ప్రారంభించాలన్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 డిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశం
Source: telugutimes.net