తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు కేంద్రం కీలక సౌకర్యం కల్పించింది. తిరుపతి (రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విదేశీ భక్తులు నేరుగా తిరుపతిలోనే ఈ-వీసా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇది ఈ-వీసా సేవలందించే 37వ విమానాశ్రయం కాగా, అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం చర్చలు జరుగుతున్నాయి.
తిరుపతి విమానాశ్రయానికి ఈ-వీసా సౌకర్యం కల్పించిన కేంద్రం
Source: telugutimes.net