సంగారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆరుగురు కూలీలు మృతి చెందగా, కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి వద్ద కారు అదుపు తప్పడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంగారెడ్డిలో రెండు ప్రమాదాల్లో 8 మంది మృతి
Source: Eenadu