తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆగస్టు 13న ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించనుంది. 119 నియోజకవర్గాల్లో ఒక్కో దానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 మిషన్లను 100% సబ్సిడీతో అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణలో బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభం
Source: Zee Telugu News