సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ చేయూత పింఛన్ల దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పకడ్బందీగా స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులు, గీత, నేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కేంద్రాల్లో వసతులు కల్పించాలని, అర్హత పత్రాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
చేయూత పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశం
Source: HMTV