తెలంగాణ ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. ఘాట్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య సౌకర్యాల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించాలని, ఆగస్టు చివరికి టెండర్లు పూర్తి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్ల నిధులు
Source: Vaartha