స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీ హైకోర్టు, ఇందిరాగాంధీ విమానాశ్రయం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేస్తూ బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు హైకోర్టులో పేలుడు జరుగుతుందని హెచ్చరించారు. భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పద వస్తువులు ఏవీ కనుగొనలేదు. బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది.
స్వాతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు
Source: Asianet Telugu