మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హిట్ అండ్ రన్ కేసులో ఆయన 23 రోజులుగా రిమాండ్లో ఉన్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెల కాపరి దనయ్య మృతి చెందిన ఘటనలో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తును మళ్లించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై అప్పలరాజును అరెస్ట్ చేశారు.
సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు
Source: Great Andhra