2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భక్తుల రద్దీ ఉండే ప్రాంతాలను టైర్-1గా గుర్తించి, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనుల పురోగతి కోసం డాష్‌బోర్డ్ రూపొందించాలని, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లతో భారీ ఏర్పాట్లు
Source: Vaartha