స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో రాజ్‌భవన్ రోడ్డులో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రాజ్‌భవన్ ఎట్ హోమ్: ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించిన పోలీసులు
Source: NTV Telugu