కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్ట సవరణ బిల్లు-2026కు లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు ప్రకారం గనులు, ఖనిజాలపై రాష్ట్రాలు విధించే పన్నులు ఆగిపోతాయి. దీంతో రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2024లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పన్నుల హక్కు కల్పించిన నేపథ్యంలో ఈ సవరణ వివాదాస్పదమైంది.
గనుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. రాష్ట్రాల ఆదాయానికి గండి
Source: Namasthe Telangana