స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో కృష్ణా నదిలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. విజయవాడ సింగ్నగర్కు చెందిన వీసం గౌతమ్ (18), గడ్డం జాషువా (17), తీగుళ్ల తేజ (18) తాడేపల్లి సమీపంలోని కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్ వద్ద లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో గల్లంతయ్యారు. స్థానికులు గాలించగా మృతదేహాలు లభించాయి.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృతి
Source: Zee Telugu News