బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు.
వాయుగుండం ప్రభావం: ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులు, వర్షాలు
Source: News18 Telugu