అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వలసదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించిన వారికి గ్రీన్‌కార్డు నిరాకరించేలా USCIS కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఆహార సబ్సిడీలు, హౌసింగ్ వోచర్లు, వైద్య సాయం వంటి ప్రయోజనాలను పొందినా లేదా పొందే అవకాశం ఉన్నా వారిని 'పబ్లిక్ ఛార్జ్'గా పరిగణిస్తారు. హెచ్-1బి వీసాపై పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిబంధనల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
గ్రీన్‌కార్డుకు అమెరికా కఠిన నిబంధనలు
Source: News18 Telugu