ఆత్మకూర్ పోలీసులు పెద్దాపూర్‌లో దొంగతనం చేసి ఇంటికి నిప్పు పెట్టిన నిందితుడు శివరాజ్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.42 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో అనుమానం మళ్లించేందుకు నిందితుడు నిప్పు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది.
పెద్దాపూర్‌లో దొంగతనం, ఇంటికి నిప్పు పెట్టిన నిందితుడు అరెస్ట్
Source: HMTV