ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఫార్మసీలకు హెచ్చరిక జారీ చేసింది. 60%, 70%, 80% డిస్కౌంట్ల ప్రకటనలు నిజమైనవిగా ఉండాలని, అతిశయోక్తి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయని పేర్కొంది. MRP కంటే తక్కువకు మందులు అమ్మడంపై నిషేధం లేదని, కానీ ప్రకటనలో చూపిన డిస్కౌంట్ వాస్తవంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ అడ్వైజరీ జారీ చేసింది.
ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ హెచ్చరిక: భారీ డిస్కౌంట్ ప్రకటనలపై ఆంక్షలు
Source: NTV Telugu