కొమరాడ మండలం కుస్తూర్ గిరిశిఖర గ్రామానికి రోడ్డు మంజూరైనా పనులు సగంలో ఆగిపోయాయి. దీంతో అనారోగ్యానికి గురైన తాడంగి సురేష్ను గ్రామస్థులు డోలీలో నాలుగు కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రికి చేర్చారు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుస్తూర్ గిరిశిఖర వాసులకు డోలీ కష్టాలు తప్పడం లేదు
Source: Andhra Jyothy