ఢిల్లీలో విద్యార్థి సాహిల్ లోచబ్పై పెల్లెట్ గన్ ప్రయోగించారన్న ఆరోపణలపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేసిన కొన్ని గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 20న జరిగిన నిరసన ర్యాలీలో సాహిల్ కంటిలో మూడు పెల్లెట్లు తగిలాయని వైద్య నివేదికలు చెబుతున్నాయి.
పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
Source: NTV Telugu