యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హేజిలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన చెన్ను నాగిరెడ్డి (31), నాగనబోయిన నరేష్ కుమార్ (29)గా గుర్తించారు. కంపెనీ ప్రతి కుటుంబానికి రూ.2.8 కోట్ల పరిహారం ప్రకటించింది.
హేజిలో ఫార్మాలో రియాక్టర్ పేలుడు: ఇద్దరు మృతి
Source: Vaartha