పోలవరం పరిధిలోని చింతూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఒడిశా నుంచి ఇనుము లోడుతో తమిళనాడు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు బోడుగూడెం సమీపంలో ఢీకొట్టింది. మృతులను నిమ్మకాయల అయ్యన్న (35), అడివి సూర్య వినయ్ తేజ (28)గా గుర్తించారు.
పోలవరం వద్ద కారు-లారీ ఢీకొని ఇద్దరు సజీవ దహనం
Source: Vaartha