దేశంలో ఇంధన భద్రత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) దేశవ్యాప్తంగా 1,800 కిలోమీటర్ల మేర 3 వ్యూహాత్మక LPG పైప్‌లైన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 7,000 కోట్ల అంచనా వ్యయంతో GAIL ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల మీదుగా ఈ నెట్‌వర్క్ విస్తరించనుంది.
తెలంగాణ మీదుగా రూ. 7,000 కోట్లతో LPG పైప్‌లైన్లు
Source: Vaartha