గర్భధారణకు ముందు తండ్రి ఆరోగ్యం, ఆహారం, జీవనశైలి బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. మద్యపానం వల్ల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం 35 శాతం వరకు పెరుగుతుందని, తండ్రి వయస్సు, మానసిక ఆరోగ్యం కూడా కీలకమని పరిశోధకులు తెలిపారు. తల్లితో పాటు తండ్రి ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
తండ్రి జీవనశైలి బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
Source: HMTV