విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. రూ.12 వేల కోట్ల బకాయిలతో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని పేర్కొంది. దీనిపై నిరసనగా హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎదుట రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ 2 రోజుల నిరాహార దీక్ష
Source: Zee Telugu News