ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నాలుగు నెలల విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల పర్యటనలో ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు, పీఠికాపురవనం, అగ్రహారం మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చెరువుల పునరుద్ధరణ, రహదారులు, ప్రజా సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు.
పిఠాపురంలో రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన
Source: telugutimes.net