బెంగళూరు-చిత్తూరు-తిరుపతి/చెన్నై రహదారిపై చిత్తూరు సమీపంలోని శ్రీ వర్ష గ్రాండ్ వద్ద టాటా పవర్ తన మొదటి 240 కిలోవాట్ల డీసీ అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. యూనివర్సల్ సీసీఎస్-2 కనెక్టర్లతో దాదాపు అన్ని ప్రముఖ ఈవీ మోడళ్లకు అనుకూలంగా పనిచేసే ఈ కేంద్రం, తిరుపతి భక్తులకు, బెంగళూరు-చెన్నై ప్రయాణికులకు ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. దేశవ్యాప్తంగా 700 నగరాల్లో 6,700కు పైగా పాయింట్లున్న టాటా పవర్ ‘ఈజడ్ ఛార్జ్’ నెట్‌వర్క్‌లో ఇది భాగం.
చిత్తూరులో టాటా పవర్ అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్
Source: Vaartha