ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏటీఎం ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపిన బాటలో మిగిలిన బ్యాంకులూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి అదనపు రుసుము లేకుండా నగదు డ్రా చేసుకోవచ్చు.
బ్యాంకు సమ్మె: ఏటీఎం ఛార్జీలు రద్దు
Source: Vaartha