ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. అర్హులైన ప్రతి మహిళకు బ్యాంకు ద్వారా లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. సాధారణ మహిళలు 24 వాయిదాల్లో, ఎస్సీ, ఎస్టీ మహిళలు 36 వాయిదాల్లో అసలు మాత్రమే చెల్లించవచ్చు. వడ్డీ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
ఏపీలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు
Source: Vaartha