దేశవ్యాప్తంగా 28-30 వరకు తలపెట్టిన బ్యాంకుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. వారానికి ఐదు పనిదినాలపై ఐబీఏ సానుకూల హామీ ఇవ్వడంతో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సోమవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మరోవైపు, మర్చంట్ యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2న రిటైలర్లు 'నో యూపీఐ డే' నిర్వహించనున్నారు.
బ్యాంకుల సమ్మె వాయిదా.. అక్టోబర్ 2న యూపీఐ నిరసన
Source: Asianet Telugu