కేరళలోని త్రిశ్శూర్‌లో మహిళను అపహరించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో బాధితురాలి ప్రియుడి భార్యతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిలంబూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ సెప్టెంబర్ 22న ప్రియుడు గుణశేఖరన్‌తో లాడ్జిలో బస చేయగా, అతని భార్య దేవి ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి పోలీసుల వేషంలో దాడికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. మరో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నాడు.
త్రిశ్శూర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్
Source: Vaartha