ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన 807 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించింది. అక్టోబర్ 7న దరఖాస్తుల పరిశీలన, 8న కలెక్టర్ల పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు అదే రోజు లైసెన్సులు ఖరారు చేయనున్నారు. మరింత మందికి అవకాశం కల్పించే లక్ష్యంతో ఈ పొడిగింపు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో 807 మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
Source: Vaartha